సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు..

113
Minister Errabelli Dayakar
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌ను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దడం కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా వరంగల్‌లో సెంట్రల్ జైల్ స్థలంలో 2వేల పడకలతో 33 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మాణానికి 11 వందల కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. జూన్ 21వ తేదీన 33 అంతస్తుల ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కాగా, నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు ఓరుగల్లు ప్రజల తరుపున పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -