గద్వాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. పెబ్బేర్ మండలం రంగాపూర్‌లో, కొత్తకోట మండలం విలియంకొండలో కాసేపు ఆగారు. జాతీయ రహదారి 44 పక్కన ఉన్న పంట పొలాలను సీఎం పరిశీలించారు. మినుము పంట సాగు చేస్తున్న మహేశ్వర్ రెడ్డి, వేరుశనగ వేసిన రాములుతో సీఎం కేసీఆర్ మాట్లాడి, పలు విషయాలను చర్చించారు. సీఎం కేసీఆర్ వెంట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
ఆరుతడి పంటలే వేయాలని కేసీఆర్ రైతులకు సూచించారు. ఆరుతడి పంటల వల్ల భూసారం కూడా పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. వానాకాలంలో వరి పంట వేసుకుని, యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు కేసీఆర్ సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందని కేసీఆర్ అన్నారు. పంటల సాగుపై కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు.. యుద్ధాలే జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.