- Advertisement -
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని , ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి వెంకట్రామ్ రెడ్డి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి గద్వాల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి చిత్ర పటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,వి. శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్సీ గోరటి వెంకన్న , ఎమ్మెల్యేలు సి లక్ష్మారెడ్డి , ఆల వెంకటేశ్వర్ రెడ్డి , వి ఎం అబ్రహం , మర్రి జనార్దన్ రెడ్డి , హర్షవర్ధన్ రెడ్డి , గువ్వల బాలరాజు , ఎస్ రాజేందర్ రెడ్డి , చిట్టెం రామ్మోహన్ రెడ్డి , జైపాల్ యాదవ్ , పట్నం నరేందర్ రెడ్డి , జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య తదితరులు ఉన్నారు.
- Advertisement -