ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇప్పటికే తెలంగాణాలో అన్ని చోట్ల వైద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు.
ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణి కుంలందరికి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒకవేళ వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే గచ్చిబౌలి టీమ్స్‌కు తరలించనున్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు దేశంలో, రాష్ర్టంలో ఒమిక్రాన్ ప్రవేశించలేదని అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. ఎయిర్ పోర్టులో కట్టుదిట్టమైన చర్యలు అటు కేంద్ర, ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
ప్రతిచోట థర్మల్ స్క్రీనింగ్‌లు చేస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవ్వరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.