- Advertisement -
ఏపీలో బీసీల కోసం త్వరలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. కరోనా సమయంలో ఆనందయ్య తన ఆయుర్వేద మందుతో ఎంతో పాపులారిటీ సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలా కాలం తర్వాత తాను కొత్త పార్టీని స్ధాపించనున్నట్లు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు బీసీ ప్రజలను సరిగ్గా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని ఆనందయ్య తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ వస్తే.. దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని ఆనందయ్య వెల్లడించారు.
- Advertisement -