ఆత్మీయుడిని కొల్పోయా: చిరంజీవి

142
chiru
- Advertisement -

లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి…శివశంకర్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

శివశంకర్ మాస్టర్ మరణ వార్త తనని కలచి వేసిందని… శివశంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారన్నారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం. ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్ గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారని తెలిపారు.

చరణ్ బ్లాక్ బస్టర్ మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించ లేదన్నారు. ఆత్మీయుడిని కొల్పోయానని.. యావత్ సినీ పరిశ్రమకే ఆయన మృతి తీరని లోటు అన్నారు.

- Advertisement -