దేశంలో 24 గంటల్లో 8,318 కరోనా కేసులు

84
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 8,318 కరోనా కేసులు నమోదుకాగా 465 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,63,749కి చేరగా 3,39,88,797 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,07,019 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,67,933 మంది వైరస్‌కు బలయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 4,677 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 121.06 కోట్ల డోసులను పంపిణీ చేశామని వైద్య శాఖ వెల్లడించింది.

- Advertisement -