బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 83 హైలైట్స్

222
ravi
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 83 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 83వ ఎపిసోడ్‌లో భాగంగా ప్రియాంక చెల్లి మధు, రవి ఫ్యామిలీ, షన్ను మదర్ ఎంట్రీ ఇచ్చారు. సన్నీ మదర్ కళావతి ఇంట్లో సందడి వాతావరణాన్ని తీసుకొచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో నీకు చెల్లి దొరికింది అని కాజల్‌ను, మంచి ఫ్రెండ్ దొరికాడు అని మానస్ గురించి కళావతి చెప్పారు.

అందరూ బాగా ఆడుతున్నారని చెప్పిన కళావతి…టైటిల్ మాత్రం నువ్వే గెలవానలి సన్నీకి తెలిపింది. నాగార్జున గారు ప్రేమ ఉన్నప్పుడే కోప్పడతారు.. ఆయన చాలా మంచి వారు అని తెలిపింది. తర్వాత ప్రియాంక చెల్లి మధు ఎన్నో హింట్లు ఇచ్చింది. ప్రియాంక ఆట గాడి తప్పిందని, కేవలం ఆట మీద మాత్రమే ఫోకస్ పెట్టు అంటూ తెలిపింది. తలదించుకునే పనులు చేయను అని నాన్నకు మాటిచ్చావ్ కదా దాన్ని నిలబెట్టుకోమని తెలిపింది.

తర్వాత రవి ఫ్యామిలీ వచ్చింది. మొదట రవి భార్య నిత్య మాత్రమే వస్తుంది. దీంతో రవి కాస్త డల్ అవుతాడు. వియా రాలేదా? అని నిత్యను అడుగుతాడు రవి. ఎంతో ట్రై చేశాను. కానీ కుదరలేదు.. ఇంకా మూడు వారాలో కదా? అంటూ కాసేపు ఆట పట్టిస్తుంది. కానీ ఆ తరువాత వియా కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి.

నీకు ఎన్ని పేర్లు పెట్టారో అందరికీ తెలుసు. కానీ అవేమీ నిన్ను ఎఫెక్ట్ చేయలేదు. నువ్వెంటో అందరికీ తెలుసు. నీకు ఎంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు అంటూ నిత్య…రవి గురించి చెబుతుంది. విన్నర్ ఎవరు అవుతారు అని తన పాపను రవి అడిగితే.. డాడీ అవుతాడు అని చెప్పేసింది.

చివరకు షన్ను మదర్ ఉమా రాణి ఎంట్రీ ఇవ్వగా అమ్మను చూసి ఫ్రీజ్ పొజిషన్‌లో ఉన్న షన్ను ఎమోషనల్ అవుతాడు. లెటర్‌లో రాశాను. మార్నింగ్ డ్యాన్స్ చేయమని అన్నాను.. ఓ రెండు రోజులే చేశావ్.. మళ్లీ చేయడం లేదు అని తెలిపింది. నా బాండ్ ఎవరితో బాగుంది.. రవితోనా? సిరితోనా? అని షన్ను అడుగుతాడు. అందరితో ఉండు.. ఒకరితోనే ఉండకు. ఒక మూలకు వెళ్లి ఒకరితోనే ఉండకు అని క్లాస్ పీకేశారు. తర్వాత షన్ను.. దీప్తి టాపిక్ తీశాడు. దీప్తిని కలిశావా? అని అడగ్గా . కలిస్తే ఏంటి? అని కౌంటర్ వేశారు ఉమా రాణి. నేను అర్థం చేసుకున్నట్టే.. తను కూడా నిన్ను అర్థం చేసుకుంది.. మాకు మంచి పేరు తీసుకొచ్చావ్.. అంతా హ్యాపీ అని చెబుతుంది.

- Advertisement -