పవన్‌ సింగిల్ పీస్‌..సూర్య ప్రశంసలు

148
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పించారు దర్శకుడు ఎస్‌జే సూర్య. ఖుషీ సినిమాతో పవన్‌కు ఆల్ టైం హిట్ ఇచ్చిన సూర్య…లూప్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పవన్‌పై ప్రశంసలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ అని.. దేవుడు స్వయంగా కూర్చొని తయారుచేసిన సింగిల్ పీస్ అని తెలిపారు. ఆయన ఏదైనా అనుకుంటే అది వెంటనే జరిగిపోవాలి అని చెప్పారు.

ఇక మహేష్ గురించి మాట్లాడుతూ..తన మనసుకు నచ్చిన పని చేయడానికి కొంత ఆలోచిస్తారు. కొంత సమయం తీసుకుంటారన్నారు. కోలీవుడ్ విషయానికొస్తే పవన్ ని అజిత్ తోను.. మహేష్ ని విజయ్ తోను పోలుస్తా అని తెలిపారు.

వాలి సినిమాతో దర్శకుడిగా మారారు సూర్య. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’లో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’గా విడుదల చేయనున్నారు.

- Advertisement -