మా ఆఫీస్‌కు తాళం..మొదలైన రచ్చ!

14
prakashraj

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో రచ్చ మొదలైంది. మా ఎన్నికలు జరిగి నెలరోజులు దాటిన రచ్చ ఆగడం లేదు. కొత్త ప్యానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం లేదని కొందరు నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా మూసిఉంటోందని ప్రకాశ్ రాజ్ ప్యానల్ వెల్లడించింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరగలేని ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్గం ఆరోపిస్తుండగా దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.