ఉత్కంఠరేపుతున్న రాజ’శేఖర్’ గ్లింప్స్..

107
- Advertisement -

యాంగ్రి మ్యాన్‌ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. తాజాగా ఈ సినిమా నుండి టీజర్‌ విడుదలైంది. ఓ రిపోర్టర్‌ చదివిన నేర వార్తతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. ‘వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా.. వాడు చేసేది మనకు చెప్పాడా’ అని కథానాయకుడి పాత్ర తీరు గురించి సాగిన సంభాషణ మెప్పిస్తుంది.

బుల్లెట్‌పై చేతులు కట్టుకుని కూర్చుని ఉన్న రాజశేఖర్ పిక్ కూడా చిత్ర బృందం ఈ సాయంత్రం విడుదల చేసింది. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -