- Advertisement -
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ చిత్రంలో నటిస్తున్నాడు. లలిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఎమ్. ఎల్. వి సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 25న ఈ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రాజశేఖర్ ఫస్టు లుక్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నెరిసిన గెడ్డం మీసాలతో.. పెద్దగా మేకప్ లేకుండా వదిలిన ఆయన లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. మరి ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -