మొక్కలు నాటిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..

45

ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధి వేదపాఠశాలలో వేద పండితుల ఆశీర్వచనాలతో మామిడి మొక్కను నాటారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… తన పుట్టినరోజు సందర్భంగా శ్రేయేభిలాషులు, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అనవసర ఖర్చులతో బోకెలు‌,శాలువాలు,కేకులకు వృధా చేయకుండా నిరుపేదలకు, విద్యార్థులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.