ఇటీవల రాపిడో సంస్థ టీఎస్ ఆర్టీసీని కించపరుస్తూ చేసిన యాడ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ యాడ్‌లో నటించిన అల్లు అర్జున్, రాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చారు ఎండీ సజ్జనార్.
తాజాగా మన టీఎస్ ఆర్టీసీ బస్సు స్పెషల్ ఏంటో తెలుసా ? అంటూ ఓ స్పెషల్ మీమ్ ను షేర్ చేశారు. ఆ మీమ్ లో “ఏముందిరా మీ ఆర్టీసీలో స్పెషల్ ?” అని అమల పాల్ ప్రశ్నిస్తున్నట్టుగా కన్పించగా, “నా ఆర్టీసీ బస్ లో స్పెషల్ ఏముందా? 100 రూపాయల టి-24 టికెట్ కొనుక్కుని హైదరాబాద్ మొత్తం తిరుగుతాము. నువ్వు 100 రూపాయల పెట్రోల్ కొట్టుకుని నీ ఆడి కార్ లో హైదరాబాద్ మొత్తం తిరగగలవా ? 200 రూపాయలు పెట్టి స్టూడెంట్ పాస్ తీసి నెల మొత్తం తిరుగుతా. అదే నువ్వు 200 పెట్రోల్ కొట్టించుకుని నీ ఆడి కార్ లో నెల రోజులు కాదు కనీసం ఒక్కరోజైనా తిరగగలవా ? 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేస్తా. నీ కార్ లో కనీసం 10 మందిని అయినా ఎక్కించుకోగలవా ? కారును బుక్ చేసుకోవాలంటే ముందే సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అదే బస్సుకు అయితే అదేం అక్కర్లేదు అంటూ ఆర్టీసీ తక్కువ చేసి మాట్లాడే వారికి ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు సజ్జనార్.