22న లక్నోలో కిసాన్ మహా పంచాయత్..

114
kissan
- Advertisement -

ఈ నెల 22న లక్నోలో కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమం జరుగుతుందన్నారు కిసాన్ మోర్చా నేతలు వెల్లడించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘా వద్ద ముగిసిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరిగింది.

వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టం, ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవడం, రైతులపై నమోదైన కేసులను రద్దు చేయడంతో పాటు పలు ఇతర అంశాలను చర్చించారు రైతు సంఘాల నేతలు.

సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు రైతు సంఘం నేత బల్బీర్​ సింగ్​ రజెవాల్. 26న ఢిల్లీకి వచ్చే అన్ని సరిహద్దుల్లో రైతుల సమావేశాలు జరుగుతాయన్నారు. 29న పార్లమెంట్ మార్చ్ నిర్వహణ,తదుపరి పురోగతిపై 27న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. పరిస్థితులనుబట్టి నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఎంఎస్​పీ కమిటీ, విద్యుత్తు బిల్లు 2020 రద్దు, రైతులపై కేసుల ఉపసంహరణ, కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను పదవి నుంచి తొలగింపు​ వంటి డిమాండ్లపై ప్రధాని మోదీకి లేఖ రాస్తాం అని వెల్లడించారు.

- Advertisement -