- Advertisement -
ప్రజలకు చేరువలో ప్రభుత్వ వైద్యం ఉందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దపేట జిల్లా చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆశా కార్యకర్తలకు జీయో 4జీ మొబైల్ సిమ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. భవిష్యత్తులో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని స్పష్టం చేశారు.
నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు.ప్రతీ పల్లె ప్రాథమిక ఉప కేంద్రంలో స్టాఫ్ నర్సు, ఏఏన్ఏఎంలు, వైద్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని…. ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
- Advertisement -