బిగ్ బాస్ 5…రవి గుంటనక్కే!

171
ravi
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 5 విజయవంతంగా 72 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 72వ ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగగా రవిని గుంటనక్క, సిరిని కట్ల పాము,షణ్ముఖ్‌ని నల్ల నక్కతో పొల్చాడు సన్నీ.

మానస్‌తో మాట్లాడుతూ…రవి అవకాశ వాది ఎటు వీలు ఉంటే అటు మాట్లాడతాడు.. జెస్సీ ఉన్నప్పుడు వాడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు.. మెజారిటీ పీపుల్స్ తన వైపున ఉన్నారని దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. కొడతా.. తన్నుతా.. అద్దం నుంచి అవతల పడతారు లాంటివి.. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు వస్తుంటాయి. వాటిని కూడా పాయింట్‌గా లేవనెత్తాడు. ఇక షణ్ముఖ్-సిరి…సన్నీపై తమ అక్రోశాన్ని వెల్లగక్కారు.

ఇక తర్వాత సన్నీ మెడలో గిల్టీ బోర్డు ఎప్పుడు తీస్తారో.. అని షణ్ముఖ్ అంటే.. తన చేసిన తప్పు తాను తీసుకోవాలి కదా అని అన్నాడు రవి. ఇక కాజల్‌తో సన్నీ…దేనిని తెగే దాకా లాగకూడదు. ఇక్కడ కొంతమంది వ్యక్తిత్వాలు ఎలాంటివి అంటే.. వాళ్లు చేసి సైడ్ అయిపోతారు.. దాని తరువాత రియాక్షన్ చూపిస్తే.. ఇలాంటి బోర్డులు వేస్తారు అంటూ బాధపడింది. రవికి ఏ జన్మకైనా నటరాజ్ మాస్టర్ ఇచ్చిందే కరెక్ట్ గంటనక్కే.. సిరి అయితే కట్లపాము.. షణ్ముఖ్ అయితే నల్ల నక్క.. నాకు నేను పేరు పెట్టుకోవాలంటే చింపాంజీ అని పేర్లు పెట్టాడు.

తర్వాత నామినేషన్స్ ప్రక్రియ మొదలుకావడంతో సన్నీ మెడలో ఉన్న గిల్టీ బోర్డును తీసేశారు బిగ్ బాస్‌.

- Advertisement -