భారతీయులకు గుడ్ న్యూస్..

194
singapore
- Advertisement -

సింగపూర్ ప్రభుత్వం భారతీయులకు గుడ్ న్యూస్ తెలిపింది. టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు చెప్పింది. ఈ నెల 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ దేశ పౌరులకు కూడా క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. ఇండోనేషియన్లకు ఈ నెల 29 నుంచి ఇది వర్తిస్తుందని, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాలకు మాత్రం డిసెంబరు 6 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారత్‌ కూడా వచ్చే విదేశీయులు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను భారత ప్రభుత్వం సడలించింది. 99 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనలు తొలగిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -