టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఆసీస్. కివీస్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొంది తొలిసారి టీ20 వరల్డ్ కప్‌ని గెలుచుకుంది.
లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే ఫించ్ (5) పరుగులకే వెనుదిరిగిన మిచెల్ మార్ష్ (77 నాటౌట్: 50 బంతుల్లో 6×4, 4×6), డేవిడ్ వార్నర్ (53: 38 బంతుల్లో 4×4, 3×6) దూకుడుగాఆడారు. చివర్లో గ్లెన్ మాక్స్వెల్ (28 నాటౌట్: 18 బంతుల్లో 4×4, 1×6)తో రాణించడంతో 18.5 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది.
అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28: 35 బంతుల్లో 3×4), డార్లీ మిచెల్ (11: 8 బంతుల్లో 1×6) విఫలమయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (85: 48 బంతుల్లో 10×4, 3×6) రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.