బిగ్ బాస్ 5…జెస్సీ ఔట్

148
jessi
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా పది వారాలు పూర్తి చేసుకుంది. 10వ వారంలో భాగంగా ఇంటి నుండి అనారోగ్య కారణాలతో జెస్సీ ఎలిమినేట్ అయ్యారు.సండే ఫండే లో భాగంగా చిల్డ్రన్స్ డే స్పెషల్ అంటూ చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, ఓడిపోయిన కంటెస్టెంట్లకు స్కూల్‌లో విధించిన శిక్షలు వేశాడు. సెక్షన్ ఏ అంటూ షన్ను, ఆనీ, ప్రియాంక, సన్నీ టీంగా విడగొట్టాడు. మిగతా వాళ్లను సెక్షన్ బీలో వేశాడు.దీనికి మానస్ సంచాలక్‌గా వ్యవహరించాడు.

ఇక ఈ ఆట తర్వాత ఓ కంటెస్టెంట్‌ను సేఫ్ చేశారు. కాలింగ్ బెల్‌తో సేఫ్, అన్ సేఫ్ అనేది ప్రకటించారు. కాలింగ్ బెల్ నొక్కితే.. రెస్టారెంట్ క్లోజ్డ్ అని వస్తే అన్ సేఫ్.. ఆర్డర్ ప్లీజ్ అని వస్తే సేఫ్ అయినట్టట. అలా సిరి నొక్కినప్పుడు మాత్రమే ఆర్డర్ ప్లీజ్ అని వస్తుంది. అలా సిరి సేఫ్ అయిపోయింది. రవి, కాజల్, మానస్‌లు అన్ సేఫ్ అయ్యారు.

తర్వాత హీరోలు, వారిచిన్నప్పటి ఫోటోలను గుర్తు పట్టాల్సి ఉంటుందని తెలపగా హీరోల ఫోటోలు సరిగ్గానే గుర్తు పట్టారు కానీ హీరోయిన్ల ఫోటోలను మాత్రం గుర్తు పట్టలేదు. ఈ టాస్కులోనూ సెక్షన్ ఏ గెలిచింది. తర్వాత రవి సేఫ్ అయ్యారు. తర్వాత గేమ్‌లో భాగంగా రవి ఫేక్ అని చెప్పేశాడు సన్నీ. అతని స్ట్రాటజీ ఏమో గానీ ఆయన మాట్లాడుతుంటే ఫేక్ అనిపిస్తుందని చెప్పాడు. ప్రియాంక తనకు తలనొప్పి అని, చెప్పింది వినదు సాగదీస్తుందని మానస్ అన్నాడు. కాజల్ ఆటల్లో చాలా కన్నింగ్ అని శ్రీరామచంద్ర తెలపగా షన్ను సెల్ఫిష్ అని ప్రియాంక చెప్పింది. సిరి డబుల్ ఫేస్ అని కాజల్ తెలిపింది. షన్ను కూడా అదే మెడల్ ఇచ్చాడు. షన్నుకి నెగెటివ్ అనే మెడల్‌ను ఇచ్చింది సిరి. చివరకు కాజల్, మానస్‌లను టెన్షన్ పెట్టాడు. కానీ ఇద్దరూ సేఫ్ అన్నట్టు తెలిపాడు. జెస్సీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు అని నాగ్ చెప్పాడు.

తర్వాత బయటకు వచ్చిన సన్నీ…ఆసక్తికర విషయాలు తెలిపాడు. మొదటగా సన్నీతో ఆట బాగానే ఆడుతున్నావ్.. కొంత మంది నిన్ను వాడుకుంటున్నారు.. అని చెప్పాడు.మానస్‌తో మాట్లాడుతూ..నువ్ సైలెంట్ కిల్లర్.. సీక్రెట్ రూంలో ఇంకో యాంగిల్ చూశాను. రవి కంటే బాబువి నువ్ అని అన్నాడు.కాజల్‌తో మాట్లాడుతూ.. నవ్వకు.. నిన్ను తిట్టాలని ఉంది.. నిన్ను వాడుకుంటున్నారు.. అది తెలుసుకో అని కనువిప్పు కలిగించాడు.

ఆనీ మాస్టర్‌తో మాట్లాడుతూ.. హాయ్ ఫైటర్.. ఆట బాగానే ఉంది.. మీకు కాజల్‌కు గొడవలేంటి.. అర్థం కాలేదు.. అని అన్నాడు. ప్రియాంకతో మాట్లాడుతూ..ఇకనైనా త్యాగాలు ఆపేయ్.. పదో వారం దాటేశావ్.. ఏం చూపిద్దామని అనుకున్నావ్.. మధర్ థెరిస్సా అనుకుంటున్నావా? అని చీవాట్లు పెట్టేశాడు. శ్రీరామచంద్రతో మాట్లాడుతూ.. అందరినీ అలా టచ్ చేసి పోతోన్నావ్.. టాప్ 5లో ఉంటావ్ అని తెలిపాడు.

రవితో మాట్లాడుతూ.. నీ కోసం పది నిమిషాలు బిగ్ బాస్‌తో ఫైట్ చేశాను.. కేక్ కోసం అర్హత నీకే ఉంది.. నువ్ ఇలానే ఆడు.. ఫైనల్లో కలుస్తా అని తెలిపాడు. ఇక సిరితో ముద్దులు, ఐ లవ్యూలు చెప్పుకోవడమే సరిపోయింది. ఇద్దరూ నాగ్ ముందు సరసాలు ఆడేశారు. ఇక షన్నుతో చివరగా మాట్లాడిన జెస్సీ.. ఏం చెప్పాలి రా దీపుకి అని అన్నాడు. చూసిందే చెప్పు అని షన్ను అంటాడు. చాలా చూశా అని సెటైర్ వేస్తాడు జెస్సీ. అర్థమైందే చెప్పు.. నువ్ ఇలా వెళ్లిపోతూ ఇంకొకరికి లైఫ్ ఇచ్చి వెళ్తున్నావ్ అది నా జెస్సీ అంటూ షన్ను తెలిపాడు.

- Advertisement -