జపాన్ చేరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

230
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు వెళుతుంది.జపాన్ లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ కోహన ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థులు,ఉపాధ్యాయులతో కలిసి ఆరెంజ్,ఆలివ్,రోజ్ మొక్కలు నాటారు..

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు తెలియజేసారు.హరిత ప్రపంచానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని రాజ్‌గ్రూప్, నిర్వాణం & నేహా ఎన్ టెక్నాలజీస్ నిర్వహించాయి..

జపాన్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లినందుకు జపాన్ రాయబారి సంజయ్ కుమార్ వర్మ కి రాజ్‌గ్రూప్, నిర్వాణం & నేహాఎన్‌టెక్ బృందానికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్.

- Advertisement -