రైతులకు మద్దతుగా భారీ ధర్నా: తలసాని

115
Talasani
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారు… వారికి మద్దతుగా టిఆర్ఎస్ హైదరాబాద్ లో ఈ నెల12న భారీ ధర్నా చేపట్టనున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఈ నెల12న చెప్పట్టే ధర్నా ఏర్పాట్లు పరిశీలించారు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని..రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది..దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. కేంద్రం తెలంగాణను ప్రోత్సహించకుండా… ఇబ్బంది పెడుతుందన్నారు. కేంద్రం వ్యవసాయం రంగంలో నల్లచట్టాలని తెచ్చిందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు…కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తాం అన్నారు.

బిజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారు… దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తాం అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలని పిలిచి చెప్పాలని కేంద్ర బీజేపీ నేతలను కోరుతున్నాం అన్నారు.

ఈ నెల12 వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు హోంమంత్రి మహమ్మద్ అలీ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తుట్టే… కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దెత్తున… ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో వరి సాగు పెరిగిందన్నారు.

- Advertisement -