- Advertisement -
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. బర్మింగ్‌హామ్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో మాలిక్‌ను నిఖా చేసుకున్నారు మలాలా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మలాలా.
ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములమయ్యాం. బర్మింగ్హమ్లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం అని వెల్లడించింది. మాకు మీ ఆశీస్సులు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం అని తెలిపింది.
- Advertisement -