దాక్షాయణిగా రంగమ్మత్త..!

90
anasuya
- Advertisement -

బుల్లి తెర,వెండి తెరపై తనదైన శైలీలో నటిస్తూ మెప్పిస్తున్న బ్యూటీ అనసూయ. ఓ వైపు టీవీ షోలు మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న రంగమ్మత్త తాజాగా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనసూయ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌.

దాక్షాయణిని అహంకారం నిండిన మహిళ పాత్రను పోషిస్తోంది. ఆ పోస్టర్ లోనే దాక్షాయని అహంకారం ఉట్టిపడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన హిట్ మూవీ ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఆమె కెరీర్లో మరిచిపోలేని రోల్ లో కన్పించిన అనసూయ దాక్షాయణిగా ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్రను వేసుకుంటుందో చూడాలి.

ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేయగా, అన్ని పాటలకూ మంచి స్పందన వచ్చింది.

- Advertisement -