యువత కల్నల్ సంతోష్ బాబును స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ది సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్మీ ప్రీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి..దేశ రక్షణలో యువత భాగమవ్వాలన్నారు. దివంగత కల్నల్ సంతోశ్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ర్యాలీకి తరలి వచ్చిన వారందరిని అభినందించారు.అలాంటి భవిష్యత్ కల్పించేందుకు ఆర్మీ దోహదపడుతుందని వెల్లడించారు. ఈ ర్యాలీలో ఎంపికైన రెండు నెలలపాటు శిక్షణ అందిస్తారని, వారందరికి భోజన సౌకర్యాలు కల్పిస్తానని మంత్రి ప్రకటించారు.
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న రోజునే యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటుందని మంత్రి చెప్పారు. అందుకు భిన్నంగా క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతూన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం, దేశం మనదే అనగలిగినప్పుడే భవిష్యత్ ఉంటుందన్నారు.