రైతు ఉద్యమంలో 750 మంది మృతి..

108
rakesh
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 750 మంది రైతులు మృతిచెందినా కేంద్రం ఎలాంటి సంతాపం తెలపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని తాను రైతులకు కూడా ప్రధానినే అని భావించడం లేదని, తమను వేరుగా చూస్తున్నాడని భావిస్తున్నారని టికాయిత్‌ అన్నారు. ఇంతకు ముందు ఆయన మాట్లాడుతూ రైతులు నిరసన ప్రదేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్లరని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం ఐదేళ్లపాటు నడపగలిగితే.. భారత ప్రభుత్వం ఎంఎస్‌పీకి భరోసా ఇచ్చే చట్టాన్ని ఆమోదించి, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ప్రజల ఆమోదంతో నిరసన కొనసాగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -