రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు…

124
kcr
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమల చేస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఆదివారం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం… కేసీఆర్‌ బతికి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో దళితబంధు పథకం వందకు వందశాతం అమలుచేస్తం. నేను చెప్పిన పద్ధతిలోనే అమలుచేస్తం. ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు.. అంతట అమలుచేస్తం అని తేల్చి చెప్పారు.

ఉపఎన్నిక రాగానే మీరు దొంగ మాటలు మాట్లాడుతరు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నరు. నోటికొచ్చినట్టు కారుకూతలు కూసిన్రు. ఇన్నిరోజులు మీ ఆటలు చెల్లినయి బిడ్డా.. ఇకమీదట చెల్లవు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దళితులు, గిరిజనుల కోసం పెట్టిన అట్రాసిటీ చట్టాన్ని ఒక వెధవ లొట్టపీసు చట్టం అంటడా? మీకు చట్టాలంటే గౌరవం లేదు, దళిత, గిరిజన ప్రజలంటే భయం లేదు. తమాషా చేస్తున్నరా? అని మండిపడ్డారు. మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో మాట్లాడుతం. ప్రజలకు మీరేం చేసిన్రో, మేమేం చేసినమో చెప్తం. ఇప్పటిదాకా ఓపికపట్టినం. ఇకపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎంబడి పడుతం అని తెలిపారు.

- Advertisement -