- Advertisement -
హర్యానా బీజేపీ ఎంపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ రామ్ చందర్ జంగ్రా కారుపై రైతులు కర్రలతో దాడి చేశారు. కేంద్రం తెచ్చిన అగ్రి చట్టాలను ఉపసంహరించుకోవాలనిజన నాయక్ జనతా పార్టీ తరపున రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రైతులు ఎంపీ కారుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్తుండగా కొందరు దుండగులు తన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత కర్రలతో దాడి చేసి తను చంపేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఈ దాడిలో తన కారు పూర్తిగా ధ్వంసమైందన్నారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.
- Advertisement -