వెండితెరపై సుమ… రీ ఎంట్రీ..!

107
suma kanakala
- Advertisement -

తెలుగు బుల్లితెర మీద తన మాటలతో, చేతలతో తిరుగులేని యాంకర్ గా గుర్తింపుతెచ్చుకున్నది ఎవరంటే అందరు ఇట్టే చేప్పేస్తారు ఆమె పేరు సుమ అని. సుమ జనమెరిగిన మాటల పుట్ట. మాతృభాష మలయాళమైనా పదహారణాల తెలుగు నేర్చుకుని….యాంకర్లలో స్టార్ మహిళాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది సుమ.

ఇక ఇప్పటివరకు బుల్లితెర ద్వారా అలరించిన సుమ తాజాగా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సినిమా నిర్మాణం జరుపుకోనుంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్బంగా విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను శనివారం (నవంబర్ 6) విడుదల చేయబోతున్నారు. రోలుపై నిలబెట్టిన రోకలి, ఒక మహిళ చెయ్యి ప్రీలుక్ పోస్టర్ పై రివీల్ అయింది. ఆ చేతిపై వెంకన్న అని రాసుంది. ఇందులో సుమ కనకాల పాత్రకి చాలా కీలకంగా ఉండనుందట. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -