మా కుటుంబానికి తీరని శోకం:శివ రాజ్‌కుమార్

88
shiva
- Advertisement -

శాండ‌ల్‌ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణవార్తను ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోగా పునీత్ తిరిగిరా అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక పునీత్ మరణంపై తొలిసారి మీడియాతో మాట్లాడారు శివ రాజ్‌కుమార్.

పునీత్‌ మరణం మా కుటుంబానికి తీరని శోకం. అతడిని నా చేతుల‌తో ఎత్తుకొని ఆడించానని భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి బాధ ఎవ‌రికి రాకూడ‌దు. పునీత్‌కు పాల శాస్త్రం చేయడం ఎంతవరకు సరి అనేది అర్థం కావడం లేదన్నారు.

అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద సమాధిని చూడాలని పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు వారిని అనుమతించడం లేదు. దీనిపై సీఎంతో మాట్లాడి ఏం చేయాల‌నే దానిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు.

- Advertisement -