రావణాసురుడిగా మారిన రవితేజ..!

131
- Advertisement -

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇచ్చారు మేకర్స్. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నవంబర్ 5న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు రావణాసుర అనే టైటిల్‌ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’ తరువాత రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. ఈ రెండు సెట్స్ మీద ఉండగానే ‘ధమాకా’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. ఇక వీటితో పాటు మరో సినిమాను కూడా రవితేజ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.

- Advertisement -