విజయ గర్జనను విజయవంతం చేద్దాం: మంత్రి ఐకే రెడ్డి

55
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించనున్న విజయ గర్జన సభను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. దివ్యా గార్డెన్ లో నిర్వహించిన నిర్మల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ విసృత్త స్థాయి సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్నివర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీఆర్‌ఎస్సేనని అన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావమై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలేదని తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

- Advertisement -