దేశంలో స్వల్పంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవలె టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రెండోసారి కరోనా బారిన పడగా తాజాగా బాలీవుడ్ నటి ఊర్మిళా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఊర్మిలా.
తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని… ప్రస్తుతం బాగానే ఉన్నాను. హోమ్ క్వారంటైన్‌లో ఒంటరిగా ఉన్నానని తెలిపింది. గత 15 రోజుల్లో నన్ను కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరినీ వెంటనే కరోనా పరీక్షా చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. దీపావళి సంబరాల్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని, మీ ప్రియమైన వారందరినీ ప్రేమగా చూసూకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఊర్మిళ ట్వీట్ చేసింది.
2016లో తన ప్రియుడు మొహసిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది. ఆమె గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత శివసేన పార్టీలో జాయిన్ అయ్యారు.