నిర్మల్ జిల్లా నర్సాపూర్-జి, దిలావార్ పూర్ మండల కేంద్రంల్లో ఆదివారం వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కాంటాలను గ్రామాల్లోనే ఏర్పాటు చేసి వరి పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. దీలవార్ పూర్ మండలం లో 5000 ఎకరాలలో వరి సాగు చేశారన్నారు. దాదాపు 25 కోట్ల రూపాయల విలువ అని అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిర్మల్ జిల్లాలో గతంలో కంటే వరి సాగు చాలా పెరిగిందన్నారు. దీలవార్ పూర్ గ్రామంలో పోచమ్మ ఆలయ కొనేరుకు 25 లక్షలు, ఎల్లమ్మ ఆలయానికి 80 లక్షలు, ఎక్ నాథ్ ఆలయానికి 50 లక్షల నిధులు త్వరలోనే మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు.