నవంబర్ 26న ‘అనుభించు రాజా’..

66
- Advertisement -

టాలీవుడ్ రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘అనుభించు రాజా’.శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 26 న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. టైటిల్ కి తగ్గట్టే ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ఆహార్యం రొమాంటిక్‌గా ఉంటుందని ఇటీవల రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు.. టైటిల్ సాంగ్ వెల్లడించాయి. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇంతకు ముందు విడుదల చేసిన ‘అనుభవించు రాజా’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పేకాట కోడిపందాల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి. గోపిసుందర్ బాణీలు ఈ చిత్రానికి అస్సెట్ కానున్నాయి. చాలా కాలంగా రాజ్ తరుణ్ సరైన విజయం కోసం వేచి చూస్తున్నాడు. ఈ సినిమాతో పెద్ద హిట్టు కొడతాడనే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -