బీజేపీ ఓటమి ఖాయం..ఫ్రస్టేషన్‌లో ఈటల:కౌశిక్ రెడ్డి

85
kaushik
- Advertisement -

హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఓటమి ఖాయమని మండిపడ్డారు టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు పోలింగ్ బూతుల‌ను సంద‌ర్శిస్తుంటే పార్టీకి ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు బీజేపీ నేత‌లు చిత్రీక‌రించార‌ని మండిప‌డ్డారు కౌశిక్‌రెడ్డి.

తాను టీఆర్ఎస్‌ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నానని రాజ్యాంగం ప్ర‌కారం 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. నా వెనుక టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రూ లేరు. అయినా బీజేపీ నేత‌లు ఎందుకు అడ్డుకుంటున్నారు? కేవ‌లం ఓడిపోతామ‌నే ఫ్రస్ట్రేషన్‌తోనే బీజేపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకుంటున్నారు అని ఆగ్రహ్యం వ్యక్తం చేశారు.

కేవ‌లం ఓడిపోతామ‌నే ఫ్ర‌స్ట్రేష‌న్‌తోనే ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లు క‌చ్చితంగా ఓటుతో బుద్ధి చెబుతారని వెల్లడించారు.

- Advertisement -