పునీత్ అంత్యక్రియలకు ఎన్టీఆర్..

179
ntr
- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మికమరణం తీవ్ర విషాదాన్ని నింపింది. గుండెపోటుతో పునీత్ మరణించగా ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పునీత్‌కు నివాళి అర్పించగా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ పునీత్ రాజ్‌కుమార్‌ ఇద్దరు మంచి స్నేహితులు. తారక్ ఈ కన్నడ స్టార్ కోసం ఒక పాట కూడా పాడాడు. ఇక పునీత్‌ను భౌతిక కాయాన్ని చూసేందుకు, కడసారి నివాళులు అర్పించేందుకు కంఠీరవ స్టేడియంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి.

- Advertisement -