బిగ్ బాస్‌ 5: విశ్వకు ఝలుక్‌ ఇచ్చిన నాగ్‌..

200
- Advertisement -

బిగ్ బాస్‌ 5 సీజన్‌ ప్రేక్షకులను అలరిస్తు దూసుకుపోతుంది. ఇక శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాగార్జున ఇంటి సభ్యులకు చురుకలు అంటించాడు. ఈ వారం వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా ఎక్కువ మంది విశ్వ పేరుని ఎంపిక చేయ‌గా, అందుకు విశ్వ ఫీల‌య్యాడు. ర‌వి .. ప్రియాంక‌ని వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా తెలియ‌జేయ‌గా, సిరి.. కాజల్‌ను, విశ్వ.. టాస్క్‌ల్లో జీరో అంటూ ప్రియాంకను వరస్ట్‌ పర్ఫామర్లుగా సూచించారు. ప్రియాంక, జెస్సీ, ప్రియ.. విశ్వను వరస్ట్‌ పర్ఫామర్‌గా పేర్కొన్నారు. ఎక్కువ మంది విశ్వ పేరుని చెప్పడంతో అతన్ని సోమవారం నాడు జైలుకి వెళ్లాల్సిందిగా ఆదేశించారు నాగార్జున.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో శ్రీరామ్, కాజల్‌లను సేఫ్ చేశారు. మిగిలిన ఆరుగురు రవి, సిరి, లోబో, జెస్సి, ఆనీ, ప్రియలు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది. ఇక బంగారు కోడిపెట్ట టాస్క్‌లో సన్నీ గ్రూప్‌ సహాయం తీసుకుని ఆడినందుకు కెప్టెన్సీ రద్దైందని ప్రకటించి చిన్న ఝలుక్‌ ఇచ్చాడు నాగ్‌.

నాగార్జున కాస్త స‌రాదా కోసం ష‌ణ్ముఖ్ వీడియోని చూపించాడు. ఇది చూసి అంద‌రు న‌వ్వుకున్నారు. అనంత‌రం బిగ్‌బాస్‌ హౌస్‌ను శుభ్రంగా ఉంచుకోలేదని తిట్టిపోశాడు నాగ్‌. హౌస్‌ను ఎంత గలీజ్‌ చేశారో చూడండి అంటూ కంటెస్టెంట్లకు హౌస్‌నంతా వీడియోలో చూపించాడు. స‌న్నీ త‌న కెప్టెన్సీలో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశాడు.

లోబోను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన నాగ్‌.. ‘తోపు, డూపు’ గేమ్‌ ఆడించాడు. లోబో ముందుగా ఆరుగురు డూపుల గురించి చెప్తూ.. కాజల్‌ లాంటి జనాలు నాకు నచ్చరు, ఆమె ఊసరవెళ్లి అన్నాడు. ప్రియ ..వెనకాల ఒకమాట, ముందొకమాట మాట్లాడుతుందని అన్నాడు. రవికి అవసరమున్నప్పుడే ఈ లోబో గుర్తొస్తాడని బాధపడ్డాడు. యానీ.. స్మార్ట్‌ అని, షణ్ముఖ్‌ యాటిట్యూడ్‌ నచ్చదని తెలిపాడు. వీళ్లు కాకుండా మిగిలిన ఆరుగురు తోపులని చెప్పాడు.

- Advertisement -