ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దామోదర్‌తో పాటు మరో ఐదుగురుపై పోలీసులు ఈ కేసును బుక్ చేశారు. వీరిని మంగళవారం పుదుచ్చెరిలో అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు వీళ్లపై ఉన్నాయి. ఈ అందరిపైనా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌లో శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు రోహిత్ దామోదరన్. ఇతడు ఓ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్ కూడా.
రోహిత్ తండ్రి దామోదరన్, క్రికెట్ కోచ్ థమరాయ్ కన్నన్‌తోపాటు మరో ఇద్దరిపైనా పుదుచ్చెరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన సమయంలో వీళ్లు తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాగుండదని కూడా వాళ్లు హెచ్చరించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన మరో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది.