రేవంత్‌రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మాణిక్కం ఠాగూర్…!

102
Manickam-Tagore
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కుమ్మక్కు అయ్యాడని, కనీసం హుజురాబాద్‌‌కు వెళ్లి ప్రచారం కూడా చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం సీరియస్ అయింది. అసలు హుజురాబాద్‌లో ఏం జరుగుతుందని మాణిక్కం ఠాగూర్‌కు చివాట్లు పెట్టిందంట..దీంతో ఇన్నాళ్లు రేవంత్‌ను వెనకేసుకువస్తున్న ఠాగూర్ హుజురాబాద్‌లో అడుగుపెట్టాల్సి వచ్చిందంట..హుజురాబాద్‌లో బల్మూరి వెంకట్ నామినేషన్ వేసిన తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలంతా ఎవరూ ప్రచారానికి వెళ్లలేదు.ముఖ్యంగా …వెంకట్ నామినేషన్ వేసిన రోజు వెళ్లిన రేవంత్ రెడ్డి ..మళ్లీ ఆవైపు కన్నెత్తి చూసింది లేదు..స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ బై పోల్‌ను లైట్ తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నియమించిన 20 మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదంట..

హుజురాబాద్‌లో పోలింగ్‌కు ముందే రేవంత్ చేతులెత్తేశాడని హైకమాండ్‌కు సమాచారం అందిందంట..ప్రచారానికి ఇంకా 8 రోజులు మాత్రమే ఉన్నా రేవంత్ ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగకపోవడంతో అధిష్టానం సీరియస్ అయిందంట…అందుకే హుజురాబాద్‌లో మాణిక్కం ఠాగూర్ ఎంట్రీ ఇచ్చారు..హడావుడిగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు., వెంటనే కరీంనగర్‌కు వెళ్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో మీటింగ్ పెట్టి హుజురాబాద్‌లో అమలు చేయాల్సిన వ్యూహాలపై కసరత్తు చేశారు.. .ప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోతే బీజేపీ మళ్లీ డామినేట్ చేస్తుందని, దీంతో అసలుకే ఎసరు వస్తుందని మాణిక్కం సార్ భావిస్తున్నాడంట..అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిస్వయంగా కరీంనగర్‌కు వచ్చినా రేవంత్ రెడ్డి రాకపోవడం, ఆయన రాకను పట్టించుకోకపోవడం గాంధీభవన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న మొదటి ఉప ఎన్నిక అయినా …హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలిచే సీన్ లేకపోవడం వల్ల…తాను ప్రచారం చేస్తే ఓట్లు చీలి ఈటల ఓడిపోతాడనే కారణంతోనే రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. .

రేవంత్ తీరుపై మాణిక్కం సారువారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంట..ఎందుకు ప్రచారానికి వెళ్లడం లేదు…కనీసం డిపాజిట్ కూడా రాకుంటే…హైకమాండ్‌కు నేనేం సమాధానం చెప్పాలి..బీజేపీ అభ్యర్థి ఈటలను గెలిపించడం కోసం మన పార్టీని మనమే నాశనం చేసుకుంటామా..ఇదేం పద్దతి అని రేవంత్‌కు క్లాస్ తీసుకున్నాడంట.. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా ఫర్వాలేదు..గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వచ్చినా గౌరవప్రదంగా ఉంటుంది…ఇక నుంచి కాంగ్రెస్ సీనియర్లను కూడా కలుపుకుని ప్రచారం చేయ్..అంటూ ఠాగూర్ రేవంత్‌కు హుకుం జారీ చేశాడంట..మరి మాణిక్కం సారువారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారాన్ని స్పీడప్ చేస్తాడా..లేకుంటే ఈటల కోసం ఏదైతే అది అయిందని లైట్ తీసుకుంటాడో చూడాలి.

- Advertisement -