- Advertisement -
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ కూడా చమురు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు. లీటర్‌పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెరుగగా దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.19కి చేరగా, డీజిల్ ధర రూ.94.92కు పెరింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరుగగా లీటర్ పెట్రోల్ ధర రూ.110.46కు, డీజిల్ ధర రూ.103.56కు చేరాయి. చెన్నైలో లీటరు పెట్రోలు రూ.103.31, డీజిల్ రూ.99.26, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.78, డీజిల్ రూ.98.03కు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 34 పైసలు పెరిగి రూ.112.11కు, డీజిల్‌పై 37 పైసలు అధికమై రూ.102.89కు చేరాయి.
- Advertisement -