- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్ఫూర్తి గా తీసుకున్న మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రికి భూరి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వారి కుటుంబ సభ్యులు కలసి కిలో బంగారం డొనేట్ చేస్తామని ప్రకటించారు.
దీంతో మొత్తం ఆరుగురు అరు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు. ఒక గొప్ప కార్యక్రమంలో తాము సైతం భాగస్వాములం అవుతామని పేర్కొన్నారు. విరాళం ప్రకటించిన వారిలో ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్ ఉన్నారు..
- Advertisement -