కేసీఆర్ ఉపరాష్ట్రపతి వార్తలు పుకార్లే..

142
ktr
- Advertisement -

కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతున్నారనే పుకార్లపై స్పందించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్…అది కేవలం వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం మాత్రమేనని ఇలాంటి గ్లోబల్ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. వాట్సాప్ లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని తేల్చిచెప్పారు. అయితే కేసీఆర్…జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడమనేది సందర్భానుసారాన్ని బట్టి ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దెశిస్తూ కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -