ఈటల దిష్టిబోమ్మలు దహనం…

60

దళిత బంధు పంపిణీకి బీజేపీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత సమాజం నుండి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా పలు చోట్ల ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు దళిత సంఘాల నేతలు.

జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఏకంగా ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర నిర్వహించారు. మాచనపల్లి గ్రామంలో TRS పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర నిర్వహించారు. దళిత వాడలల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ దళిత ద్రోహి ఈటల రాజేందర్ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు టీఆర్ఎస్ ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు సైతం బీజేపీ నేతల తీరును తప్పుబడుతున్నారు. దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.