బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతుంది. సోమవారం అంటే నామినేషన్ రచ్చతో హౌజ్ అంతా వేడెక్కిపోతుంది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియను కాస్త విభిన్నంగా డిజైన్ చేశారు. హౌస్‌లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఏలా జరిగింది.. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు తెలుసుకుందాం..
శ్వేత నామినేషన్స్‌లో లేకపోయుంటే తాను ఎలిమినేట్ అయ్యేదాన్నంటూ భయపడిపోయింది సిరి. ఎలిమినేట్ అయ్యాడుకున్న లోబో గురించి కంటెస్టెంట్లు జోకులు పేల్చారు. లోబో తన కడుపు మాత్రమే చూసుకుంటాడని, అందరి దగ్గరా ఫుడ్ లాక్కునేవాడంటూ లోబో మీద జోకులేసింది యానీ మాస్టర్. మరోవైపు రవి, కాజల్ ఇద్దరూ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని జెస్సీతో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇక మోజ్ రూమ్‌లో ఉన్న జెస్సీ, షణ్ను, సిరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు రవి. అయితే ఇది కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అని సెటైర్ వేశాడు షణ్ను.
నిరంతం మానస్ జపం చేసే పింకీ. అతడు తనకెందుకు తినిపించడని లోలోపలే మథనపడిపోయింది. అతడికేం మాయరోగం, ఊరందరికీ తినిపిస్తాడు కదా! అంటూ మానస్ తనకు ఒక్కసారి కూడా తినిపించలేదని తెగ ఫీలైంది పింకీ. గార్డెన్ ఏరియాలో ఉన్న చెట్టుకు కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్న కోతి బొమ్మలు వేలాడుతుంటాయి. డేరాలో ఉన్న ముగ్గురు వేటగాళ్లు శ్రీరామ్, సన్నీ, జెస్సీ కోతులను చంపి వారిని నామినేట్ చేయాలి. వేటగాళ్లను ఒప్పించి వేరేవాళ్లను నామినేట్ చేయడం కోతుల లక్ష్యం. ఎక్కువ కోతులను నామినేట్ చేసిన వేటగాడు సేఫ్ అవగా మిగిలిన ఇద్దరు నామినేట్ అవుతారు.
జంగిల్ సౌండ్ వినిపించినప్పుడు రెండు అరటిపండ్లను పట్టుకోవాలి. అలా పట్టుకున్నవారు ఒక కోతిని చంపేందుకు వేటగాడిని ఒప్పించవచ్చు. మొదటగా జంగిల్ గౌండ్ వచ్చినప్పుడు సిరి, షణ్ముఖ్ చెరో అరటిపండును సంపాదించారు. ఈ సందర్భంగా షణ్ముఖ్, సిరి.. ఇద్దరూ యానీ మాస్టర్‌ను నామినేట్ చేయాలనుకున్నారు. ఇందుకు వేటగాడు సన్నీ అంగీకరించడంతో ఆమె నామినేట్ అయింది. అయితే సిరిని నామినేట్ చేస్తాను కానీ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకోను అని చెప్పింది యానీ.
తర్వాత అరటిపండు సంపాదించిన యానీ.. సిరిని, సిరి.. మానస్‌ను నామినేట్ చేయాలనుకున్నారు. కానీ సన్నీ.. యానీకి సపోర్ట్ చేస్తూ సిరిని నామినేట్ చేశాడు. అనంతరం సిరి, కాజల్‌కు అరటిపండు దక్కగా సిరి మరోసారి మానస్ పేరు సూచించగా, కాజల్.. ప్రియ పేరు చెప్పింది. సన్నీ.. కాజల్ చెప్పిన కారణానికి మద్దతు తెలుపుతూ ప్రియను నామినేట్ చేశాడు. ఇక రవి.. యానీ మాస్టర్ కోసం ఓ కవిత పాడి అక్కడున్న అందరినీ నవ్వించాడు. తర్వాత ప్రియ, సిరి అరటిపండ్లు సంపాదించారు. కానీ సిరి తను చెప్పిన వ్యక్తిని నామినేట్ చేయడం లేదని తన పవర్‌ను ప్రియాంకకు ఇచ్చింది.
దీంతో రంగంలోకి దిగిన ప్రియాంక.. కాజల్‌ను నామినేట్ చేయాలనుకుంది. ప్రియ.. రవి సోఫా మీద టవల్ ఆరేయడం నచ్చలేదంది. అయితే సన్నీ.. శ్వేతను గుర్తు చేస్తూ ఆమె ఎంతో బాధతో వెళ్లిపోయిందని, తనకోసం ఈ పని చేస్తున్నానంటూ రవిని నామినేట్ చేశాడు. సన్నీ నిజస్వరూపం బయటపెట్టడానికే ఈ రీజన్ చెప్పానంటూ వ్యంగ్యంగా నవ్వింది ప్రియ. అయితే దీనివల్ల తనకు ఎఫెక్ట్ అవుతుందని ఆవేశపడిపోయాడు రవి. ఆరు వారాల నుంచి నామినేట్ అవుతూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా? అని ప్రశ్నిస్తూనే సన్నీని బుజ్జగించే ప్రయత్నం చేశాడు,. అటు పింకీ మాత్రం తను చెప్పిన కారణాన్ని పట్టించుకోలేదని నిప్పులు చెరిగింది. ఫేక్ పీపుల్స్‌తో ఉండలేను అంటూ ఏడ్చేసింది. కానీ తన డెసిషనే ఫైనల్ అంటూ రవిని నామినేట్ చేశాడు సన్నీ.
సిల్లీ రీజన్స్ చెప్తూ నీతో ఆడుకుంటున్నారంటూ కాజల్ సన్నీకి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో తన గేమ్ ఏంటో చూపిస్తానని సవాలు విసిరాడు సన్నీ. అనంతరం సిరి, రవి అరటిపండు సాధించారు. కానీ సిరి మరోసారి ఆ పండును పింకీకి ఇచ్చేసింది. కాజల్ నామినేషన్స్‌లోకి రావాలనుకుంటోందని రవిచెప్పగా ఆమెను నామినేషన్స్‌లోకి పంపించాడు సన్నీ. ఈ టాస్కులో సన్నీ ప్రొవోక్ అయిపోయాడని హౌస్‌మేట్స్‌తో ముచ్చట్లు పెట్టాడు షణ్ముఖ్. సన్నీ ఒంటరిగా గేమ్ ఆడితే చూడాలనుందన్నాడు. మరోవైపు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవగా… ఈ వారం కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. వీరితో పాటు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో కూడా నామినేట్ అయ్యాడు. మరి ఈ వారం ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? తెలియాలంటే వేచి చూడాల్సిందే. కెప్టెన్సీ పోటీదారులకు కోడి గుడ్లను కాపాడుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారో తెలియాలి.