జమ్మి చెట్టు నాటిన ఎమ్మెల్యే రసమయి..

117
- Advertisement -

మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సోమవారం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా దసరా పండుగ సందర్భంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు- గుడి గుడికో జమ్మి చెట్టు నినాదంతో ఆయన రేణికుంట దుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దుర్గాదేవి ఆవరణలోని బ్రహ్మం గారి ఆలయం వద్ద జమ్మి చెట్టు నాటారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి స్థానిక ప్రజలకు జమ్మిచెట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎలుక అనిత-ఆంజనేయులు, రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, టిఆర్ఎస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి నాయిని వెంకటరెడ్డి, సర్పంచ్ బోయిని కొమురయ్య, ఉపసర్పంచ్ కుంభం శ్రీనివాస్, వార్డు సభ్యులు సంటి సురేష్, బొంగాని రమేష్, పోతుగంటి రమేష్, దుర్గదేవి ఉత్సవ కమిటీ సభ్యులు బొంగాని పరశరాములు, తమ్మినేని శ్రీనివాస్, కనపర్తి సత్యనారాయణ,టీ.శ్రీనివాస్, సముద్రాల రమాదేవి, గోలి తిరుపతి, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -