- Advertisement -
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చిన్నారిపై ఘోరానికి ఒడిగట్టిన నిందితున్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి పొక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా పోలీసు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశాంతమైన నిర్మల్ పట్టణంలో ఇలాంటి సంఘటన దురదృష్టకరమన్నారు. బాధితులరాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
- Advertisement -