బతుకమ్మ శుభాకాంక్షలు..

222
vijay
- Advertisement -

రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు నేటి నుండి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగతో ప్రతి పల్లె పూలవనంలా మారుతుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా తాజాగా హీరో విజయ్ దేవరకొండ స్పందించారు.

బతుకమ్మ శుభాకాంక్షలు. నా కుటుంబం ఇంట్లో ఈ పండగను జరుపుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అందమైన పువ్వుల పండగను పాటలు, డ్యాన్సులతో జరుపుకుంటారని పేర్కొన్నారు విజయ్. కవిత అక్క ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సహిస్తూ, ఈ అందమైన స్థానిక పండుగ గురించి దేశానికి అవగాహన కల్పించడం ప్రశంసనీయం అంటూ బతుకమ్మ సాంగ్ ను షేర్ చేశారు దేవరకొండ.

- Advertisement -