ప్రేక్షకుల ప్రశంసలతో మా కష్టం మరిచిపోయాం..

106
srikanth
- Advertisement -

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిన‌ ఈ సినిమాకు గురు పవన్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుద‌లై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. ‘మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా ముందుకు వెళ్తోంది. అందుకే ఈ సక్సెస్ మీట్‌కు ఎమోషనల్ హిట్ అని పెట్టాం. నిన్న (శనివారం) నాడు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మార్నింగ్ సినిమా చూశాను.. ఈవినింగ్ మళ్లీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాం అని చెప్పారు. అది విని చాలా సంతోషమనిపించింది. యూత్ కూడా సినిమా చూసి వారి ఫ్యామిలీని తీసుకెళ్లి చూపించారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఎన్నో రోజుల నుంచి థియేటర్లకు దూరంగా ఉన్న మహిళను థియేటర్లకు రప్పించాలని ప్రయత్నం చేశాం. అందులో సక్సెస్ అయ్యాం. ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. అందరూ థియేటర్లోనే ఈ సినిమాను చూడండి. ఇంత మంచి విజయాన్ని అందించినందకు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకా మంచి చిత్రాలను తీసి మిమ్మల్ని అలరిస్తాను అని మాటిస్తున్నాను’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ‘ఇది మాకు మొదటి సినిమా. అందులో రెండు లాక్డౌన్‌లు వచ్చాయి. ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ మా లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వీడలేదు. సినిమా తీయాలి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీస్తే మాకు సులభంగా అయ్యేది. కానీ మేం అలా చేయాలని అనుకోలేదు. కొత్తగా ప్రయోగం చేయాలని అనుకున్నాం. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని చిత్రాన్ని నిర్మించాం. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. దర్శకుడికి మొదటి సినిమానే అయినా కూడా ఎంతో బాగా తెరకెక్కించారు. ఇంకా మంచి చిత్రాలను అందిస్తాం. మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని ఫోన్లు చేస్తున్నారు. దర్శకుడు ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కించారని చెబుతున్నారు. దర్శకుడికి మొదటి సినిమాలా అనిపించదు. లడఖ్ అంటే ఇలా ఉంటుందా? అని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు. చాలా రోజుల తరువాత నాకు మంచి విజయం దక్కింది. సుమంత్, భూమిక, తాన్యాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు

హీరో సుమంత్ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ద్వితీయార్థానికి కనెక్ట్ అయ్యారు. చివరి 45 నిమిషాలు, లొకేషన్స్, పాటలు, డైరెక్షన్స్ ఇలా అన్నింటిని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని ఎక్కువగా టెన్షన్ పడ్డాం. దాదాపు రెండేళ్లు కష్టపడి చేశాం. కానీ ఆ కష్టం అంతా కూడా ప్రేక్షకుల ప్రశంసలతో మరిచిపోయాం. అలాంటి అప్రిసియేషన్స్ వచ్చినప్పుడు ఇంకా జోష్ వస్తుంది. ఇంకా మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తి వస్తుంది. సినిమాను థియేటర్లో చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ అద్భుతంగా ఉంది. ఆడియెన్స్ అంతా కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

- Advertisement -