‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ పూర్తి

126
kamal
- Advertisement -

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్రయూనిట్.. తాజాగా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ అయిందని పేర్కొంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ మడ్ బైక్‌పై కూర్చొని ఉన్న పిక్ షేర్ చేశారు. ఈ ఫొటోలో కమల్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్, స్టంట్ మాస్టర్ డుయో అన్బరీవ్ కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో కాళిదాస్ జయరాం, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాస్ట్: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరాం, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు

టెక్నికల్ క్రూ:
డైరెక్టర్: లోకేష్ కానగరాజ్
ప్రొడ్యూసర్స్: కమల్ హాసన్ అండ్ ఆర్. మహేంద్రన్
బ్యానర్: రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

- Advertisement -